బన్ని అతనికి హ్యాండ్ ఇచ్చాడా..!

-

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య తర్వాత ఏ సినిమా చేస్తున్నాడు అన్న క్లారిటీ ఇంకా రాలేదు. విక్రం కుమార్ తో సినిమా ఉంటుందని చెప్పినా ఆ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ బయటకు రావట్లేదు. విక్రం చెప్పిన ఓ లైన్ నచ్చినా అది డెవలప్ చేసే క్రమంలో సెకండ్ హాఫ్ ఇంప్రెస్ చేయలేదట. అందుకే విక్రం కుమార్ తో బన్ని తన సినిమా క్యాన్సిల్ చేసుకునే ఆలోచనలో ఉన్నాడట.

గీతా ఆర్ట్స్ బ్యానర్ లో సినిమా అంటే అల్లు అరవింద్ తో పాటుగా గీతా ఆర్ట్స్ టీం ను మెప్పించాల్సి ఉంటుంది. అందుకే ఈ సినిమా లేటవుతుందని తెలుస్తుంది. హలో సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో అల్లు అర్జున్ విక్రం కుమార్ విషయంలో డౌట్ గా ఉన్నాడట. ఇన్నాళ్లు ఆశపెట్టిన బన్ని ఇప్పుడు హ్యాండ్ ఇస్తే విక్రం ఎలా రెస్పాండ్ అవుతాడో చూడాలి.

విక్రం తో కాకుండా త్రివిక్రం తో తన తర్వాత సినిమా ప్లాన్ చేస్తున్నాడట బన్ని. ఎన్.టి.ఆర్ తో చేస్తున్న అరవింద సమేత సినిమా దాదాపు పూర్తి కావొచ్చింది. అక్టోబర్ 11 ఎన్.టి.ఆర్ సినిమా రిలీజ్ అయ్యాక త్రివిక్రం బన్ని ప్రాజెక్ట్ మీద కూర్చుకుంటాడట. స్క్రిప్ట్ వర్క్ ఎలాగు 6 నెలలు పడుతుంది కాబట్టి 2019లోనే బన్ని సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news