బీసీసీఐ, జైషాని అభినందించిన మాజీ కోచ్ రవి శాస్త్రి

-

సెంట్రల్ కాంట్రాక్ట్ పై బీసీసీఐ తీసుకున్న నిర్ణయాలను మాజీ కోచ్ రవిశాస్త్రి అభినందించారు. ‘ఫాస్ట్ బౌలింగ్ కాంట్రాక్టులతో ఆటను మార్చే ఎత్తుగడను ఎంచుకున్న బీసీసీఐ, జైషాకి అభినందనలు తెలిపారు. ఈ ఏడాది జరిగే కీలక సిరీస్ల కోసం టీము సిద్ధం చేయడంలో ఇది కీలక దశ అని పేర్కొన్నారు. టెస్ట్, డొమెస్టిక్ క్రికెట్ కు ప్రాధాన్యమిస్తూ శక్తిమంతమైన సందేశమిచ్చారు’ అని సోషల్ మీడియా వేదికగా రవి శాస్త్రి ట్వీట్ చేశారు.

కాగా,నిన్న బీసీసీఐ ప్రకటించిన క్రికెటర్ల రిటైనర్షిప్ లో గ్రేడ్ A+లో విరాట్ కోహ్లి,రోహిత్ శర్మ, బుమ్రా, రవీంద్ర జడేజా ఉన్నారు. గ్రేడ్ Aలో రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, kl రాహుల్, గిల్, హార్దిక్ పాండ్యా, గ్రేడ్ Bలో సూర్య కుమార్ యాదవ్, రిషబు పంత్, కుల్దీప్ యాదవ్ , అక్షర్ పటేల్, జైస్వాల్.. గ్రేడ్ Cలో రింకూ సింగ్, తిలక్వర్మ, రుతురాజ్, శార్దూల్ ఠాకూర్, శివం దూబే, బిష్ణోయ్, జితేశ్, ప్రసిద్ధ కృష్ణ, అవేశ్ ఖాన్,సుందర్, ముకేశ్ కుమార్, సంజు శాంసన్, అర్ష్ దీప్, భరత్, రజత్ పాటీదార్ ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news