మాస్‌మహారాజా రవితేజ కెరియర్‌లో కిక్ మూవీ కి ప్రత్యేక స్థానం ఉంది. సుమారు 15 ఏళ్ల క్రితం వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. రవితేజ, బ్రహ్మానందం ట్రాక్ ఈ మూవీ కి హైలైట్‌గా నిలిచింది. హల్వారాజ్ పాత్రలో బ్రహ్మానందం పండించిన కామెడీ ,ఇతర కామెడీ సీన్స్ కూడా ఇప్పటికీ ఇంకా మీమ్స్ రూపంలో కనిపిస్తూనే ఉన్నాయి.
రవితేజ కెరీర్లో సూపర్ హిట్ అయిన ‘కిక్’ సినిమా రేపు థియేటర్లలో రీరిలీజ్ కానుంది. ఈ మూవీని సురేందర్రెడ్డి డైరెక్ట్ చేశారు.ఈ చిత్రంలో ఇలియానా కథానాయికగా నటించగా,కోలీవుడ్ నటుడు శామ్ కీలక పాత్ర పోషించారు .ఈ సినిమాకు థమన్ సంగీతం అందించారు. ఇప్పటికీ ఈ సినిమాను టీవీల్లో చూసి ఎంజాయ్ చేసే వారు ఉన్నారనడంలో అతిశయోక్తి లేదు.ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ రీరిలీజ్ చేయనున్నారు. మరి రవితేజ-బ్రహ్మానందం & అలీ మధ్య జరిగే కామెడీ సీన్స్ను మళ్లీ థియేటర్లలో చూసేందుకు సిద్ధమా?