పెళ్లి చేసుకుంటానని అనుకోలేదు.. కానీ: అనంత్ అంబానీ

-

ముకేశ్ అంబానీ రెండో కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా జరగుతున్నాయి. ఈ నేపథ్యంలో తన వివాహంపై అనంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘రాధిక నాకు భార్యగా రావడం అదృష్టం. జంతుసంరక్షణలో నిమగ్నమైన నేను పెళ్లి చేసుకుంటానని అనుకోలేదు అని అన్నారు. కానీ రాధికను కలిశాక ఆమె కూడా నాలానే ఆలోచిస్తోందని తెలుసుకున్నాను. తనకూ జంతువులంటే ఎంతో ఇష్టం’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

 

కాగా, భారత దేశ అపర కుబేరుడు ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుక జామ్నగర్లోని రిలయన్స్ టౌన్షిప్ సమీపంలో ఘనంగా జరుగనున్నాయి.మార్చి 1,2,3 తేదీలల్లో ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరగనున్నాయి. ఎన్‌కోర్ హెల్త్ కేర్ సీఈఓ వీరేన్ మర్చంట్- శైలా మర్చంట్ చిన్న కుమార్తె రాధికా మర్చంట్‌ ,అనంత్ అంబానీ పెళ్లి కోసం ఊహించని రేంజ్‌లో ఏర్పాట్లు చేశారు. వంటల విషయానికి వస్తే.. ..2500 రకాల వంటకాలను సిద్ధం చేయిస్తున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news