గ్యాస్ సిలిండర్ ధరల మీద బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శలు చూస్తారు. జార్ గ్రామ్ జిల్లాలో జరిగిన కార్యక్రమం లో మమతా బెనర్జీ పాల్గొన్నారు. మళ్లీ పాత పద్ధతి లోనే వంట చేసుకోవాలని అన్నారు. ఆవస్ యోజన కింద నిర్మించి ఇళ్లను ఏప్రిల్ నెలాఖరు లోగా పూర్తి చేయాలని అన్నారు. లేదంటే బెంగాల్ ప్రభుత్వమే నిర్మిస్తుంది అని చెప్పారు.
100 రోజులు పని కింద దాదాపు 59 లక్షల మందికి బకాయిలు చెల్లించామని చెప్పారు. ఇంకో పక్క సందేశ్ ఖాలీ లో ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న షాజహాన్ ని పోలీసులు అరెస్ట్ చేశారు దాదాపు 55 రోజులు పాటు పరారీలో ఉన్న షాజహాన్ని పోలీసులు అరెస్ట్ చేయగా కోర్టు పది రోజులు పాటు కస్టడీ విధించింది ఇకపోతే షాజహాన్ ని ఆరేళ్లు పాటు పార్టీ నుండి బహిష్కరించింది టిఎంసి.