నేను ఎంపీగా పోటీ చేయట్లేదు … కాని …. : యువరాజ్

-

యువరాజ్ సింగ్.. టీమిండియా క్రికెట్ చరిత్రలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నాడు.ఆల్ రౌండర్ గా అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ తో 2011 ప్రపంచ కప్ ను ఇండియా కు అందించి ఒక్కసారిగా హీరో అయిపోయాడు. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కొన్ని లీగుల్లో మాత్రమే కనిపిస్తున్నాడు ఈ స్టార్ ప్లేయర్. ఇదిలా ఉంటే…. యువి ప్ర‌జాక్షేత్రంలో అడుగుపెట్టనున్నాడ‌ని,వ‌చ్చే పార్లమెంట్ ఎన్నిక‌ల్లో ఎంపీగా యువ‌రాజ్ సింగ్ పోటీ చేస్తాడ‌ని అంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు. బీజేపీ త‌ర‌ఫున గురుదాస్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి యూవీ పోటీ చేసే అవకాశం ఉందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.అలాగే ఇటీవల ఆయన తన తల్లి షబ్నమ్ తో కలిసి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలవడంతో పొలిటికల్ ఎంట్రీపై ఇంకా వార్తలు జోరు అందుకున్నాయి.

ఈ నేపథ్యంలో తాను ఎంపీగా పోటీ చేస్తున్నానంటూ వస్తున్న వార్తలను మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఖండించారు. ‘నేను పంజాబ్లోని గురుదాస్పూర్ నుంచి పోటీ చేయట్లేదు అని స్పష్టం చేశారు. ప్రజలకు సహాయం చేయడంపైనే నాకు ఆసక్తి ఉంది తెలిపారు. YOUWECAN ఫౌండేషన్ ద్వారా సేవ కొనసాగిస్తాను’ అని సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news