Gautam Gambhir: టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ సంచలన ప్రకటన చేశారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా అంటూ గంభీర్ సంచలన ప్రకటన చేశారు. తాను రాజకీయాలనుంచి తప్పుకుంటున్నానని… కేవలం క్రికెట్ పై దృష్టి సారిస్తానని గౌతమ్ గంభీర్ ప్రకటించారు. ఈ మేరకు బిజెపి జాతి అధ్యక్షుడు జేపీ నడ్డాను ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టాడు గౌతమ్ గంభీర్.

క్రికెట్ పై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టేందుకు రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నాను… ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన ప్రధాని మోడీ అలాగే అమిత్ షా లకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నా అంటూ పేర్కొన్నారు గౌతమ్ గంభీర్. కాగా గం మీరు ప్రస్తుతం తూర్పు ఢిల్లీ ఎంపీగా ఉన్న సంగతి తెలిసిందే. తాజా ప్రకటనతో వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో గౌతమ్ గంభీర్ పోటీ చేయబోరన్నమాట.