ఊహించని షాక్ …ఎంగేజ్మెంట్ చేసుకున్న ప్రముఖ నటి

-

ప్రముఖ నటుడు శరత్‌కుమార్ కుమార్తె, ప్రముఖ నటి ‘వరలక్ష్మి శరత్‌కుమార్’ పెళ్లి పీటలు ఎక్కబోతోంది. వరలక్ష్మి శరత్ కుమార్ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. గ్యాలరిస్ట్ ‘నికోలాయ్ సచ్‌దేవ్‌’ ముంబైలో నిన్న కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య మార్చి 1న ఉంగరాలు మార్చుకున్నారు. 14 సంవత్సరాలుగా వీరిద్దరూ ఒకరికొకరు తెలుసని ఇరు కుటుంబాలు వెల్లడించాయి. ఈ ఏడాదే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు ప్రకటించాయి.

వరలక్ష్మి 2012లో “పోడా పోడి” సినిమా ద్వారా అరంగేట్రం చేసింది. ఆమె నటనకు ప్రశంసలు అందుకుంది. మొదట హీరోయిన్ గా వరలక్ష్మి సక్సెస్ కాకున్నా….క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రం ఆకట్టుకుంటుంది.కాగా వరలక్ష్మి తెలుగులో ఇటీవల హనుమాన్, కోట బొమ్మాళి పీఎస్, బాలకృష్ణ వీరసింహారెడ్డి సహా పలు చిత్రాల్లో నటించారు.

Read more RELATED
Recommended to you

Latest news