SRH కెప్టెన్‌గా కమిన్స్..అధికారికంగా ప్రకటన

-

SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ లో ఎలాగైనా కప్‌ కొట్టాలని సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ఎంతో ఆతృతగా చూస్తోంది. ఇందులో భాగంగానే.. కమిన్స్‌ ను కొత్త కెప్టెన్‌ చేయాలని కావ్యా మారన్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ప్రకటన చేసింది హైదరాబాద్‌ జట్టు యాజమాన్యం. ఇక అటు ఐపీఎల్ 17వ సీజన్ మార్చి 22వ తేదీన ప్రారంభం కానుంది.

IPL 2024 Aus Pat Cummins SRH Captain

ఈ నేపథ్యంలో ఐపీఎల్లో సన్ రైజర్స్ టీమ్ కు కొత్త బౌలింగ్ కోచ్ రానున్నట్లు తెలుస్తోంది. డేల్ స్టెయిన్ స్థానంలో న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ జేమ్స్ ఫ్రాంక్లిన్ను బౌలింగ్ కోచ్ గా నియమించినట్లు సమాచారం. 2011, 2012 ఐపీఎల్ సీజన్లలో ఫ్రాంక్లిన్ ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడారు. ఈ టోర్నీలో కోచ్గా వ్యవహరించడం ఇదే తొలిసారి. కాగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17 సీజన్కు దూరంగా ఉండాలని స్టెయిన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాలతో అతడు విరామం తీసుకోవాలని భావిస్తున్నట్లు క్రిక్బజ్ తన కథనంలో పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news