మూసాపేట్ పేరు ముస్కిపేట్ గా మార్చాలి -హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి

-

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీ లత సంచలన అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. మూసాపేట్ పేరు ముస్కిపేట్ మార్చాలని తెలంగాణ సర్కార్‌ ను హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీ లత డిమాండ్ చేశారు. ఆ దిశగా తాను పోరాటం చేస్తానని వెల్లడించారు. కాగా..ఇటీవలే లోక్ సభ ఎన్నికలకు బీజేపీ తొలి జాబితాను ప్రకటించింది.16 రాష్ట్రాల్లోని 195 మంది అభ్యర్థులతో కూడిన లిస్టును బీజేపీ విడుదల చేసింది.

Hyderabad BJP MP candidate Madhavi Latha

ఇందులో తెలంగాణ నుంచి తొమ్మిది మంది అభ్యర్థులను ప్రకటించారు. MIM కంచుకోట హైదరాబాద్ స్థానంలో బీజేపీ మహిళకు అవకాశం ఇచ్చింది. ఇక్కడ కొన్నేళ్లుగా అసదుద్దీన్ ఒవైసీ ఎంపీగా గెలుస్తున్నారు. ఈసారి కూడా ఆయనే పోటీ చేసే ఛాన్స్ ఉండటంతో బీజేపీ విరించి హాస్పిటల్స్ ఛైర్పర్సన్ కొంపెల్లి మాధవీలతను బరిలో నిలిపింది. ప్రొఫెషనల్ భరతనాట్య నృత్యకారిణి అయిన ఆమె.. హిందుత్వం, భారతీయ సంస్కృతిపై అనర్గళంగా మాట్లాడగలరు. పాతబస్తీలో తరచూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతూ ప్రజలతో మమేకం అవుతుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news