ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్లో ప్రధాని మోదీ పర్యటన

-

ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ కశ్మీర్‌ లోయలోని శ్రీనగర్‌లో పర్యటిస్తున్నారు. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేకాధికారాలు కల్పించే ఆర్టికల్ – 370 రద్దు తర్వాత మోదీ మొదటిసారి కశ్మీర్‌కు వెళ్లారు. ఈ క్రమంలో శ్రీనగర్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బక్షీ స్టేడియంలో నిర్వహించే కార్యక్రమంలో మోదీ పాల్గొంటారు. అక్కడి నుంచే హజ్రత్‌బల్‌ దర్గా సమగ్రాభివృద్ధి ప్రాజెక్టుతోపాటు సోనామార్గ్‌ స్కీ-డ్రాగ్‌ లిఫ్ట్‌ను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించనున్నారు. హజ్రత్‌బల్‌ దర్గా ప్రాజెక్ట్‌ను తీర్థయాత్ర పునరుజ్జీవనం, ఆధ్యాత్మిక వృద్ధి డ్రైవ్‌లో భాగంగా అభివృద్ధి చేశారు. గందర్‌బల్‌ జిల్లా సోనామార్గ్‌లో స్కీ-డ్రాగ్‌ లిఫ్ట్‌కు శ్రీకారం చుట్టనున్నారు. పర్యాటకులను ఆకర్షించటమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు చేపట్టారు.

ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో శ్రీనగర్‌లో అధికారులు భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు. ఓవైపు డ్రోన్ల ద్వారా భద్రతను పర్యవేక్షిస్తూ మరోవైపు వేర్వేరు ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. బ్యారికేడ్లను ఏర్పాటు చేయటంసహా వీవీఐపీల రాక నేపథ్యంలో ట్రాఫిక్‌ను దారి మళ్లించారు. బక్షీ స్టేడియానికి 2 కిలోమీటర్ల పరిధిలో పూర్తి లాక్‌డౌన్‌ అమలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news