ప్రజాప్రయోజనాల దృష్ట్యా బేషజాలకు వెళ్లం: సీఎం రేవంత్‌రెడ్డి

-

గత ప్రభుత్వం ప్రజల అవసరాలను మర్చిపోయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాజీవ్ రహదారిపై ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి సికింద్రాబాద్‌లోని అల్వాల్ టిమ్స్ సమీపంలో భూమిపూజ చేశారు. రాజీవ్‌ రహదారిపై 11 కి.మీ పొడవుతో 6 లేన్లతో రూ.2,232 కోట్లతో భారీ ఎలివేటేడ్ కారిడార్ నిర్మించనున్నారు. శంకుస్థాపన అనంతరం రేవంత్ మాట్లాడుతూ.. కేంద్రంతో గత ప్రభుత్వం వివాదం వల్ల ఈ ప్రాజెక్టును పక్కనబెట్టారని తెలిపారు. రాజీవ్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ ప్రాధాన్యతను కేంద్రానికి వివరించామని, ఎంపీగా ఉన్న సమయంలో రాజీవ్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని వెల్లడించారు.

రాష్ట్ర-కేంద్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణాత్మక వైఖరి ఉంటే ప్రజలకే నష్టం కలుగుతుంది. మేడ్చల్‌ అభివృద్ధి చెందాలంటే రాజీవ్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ పూర్తవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్రం రక్షణ శాఖ భూములను అప్పగించింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా బేషజాలకు వెళ్లం. ఉత్తర తెలంగాణ అభివృద్ధి జరగాలంటే రాజీవ్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ పూర్తవ్వాలి. అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news