ఇందిరమ్మ ఇళ్లు స్కీమ్.. పట్టణ గృహాలకు కేంద్రం సహకారం తీసుకునే యోచనలో రాష్ట్రం

-

తెలంగాణలో ఈనెల 11వ తేదీన ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ పథకానికి సంబంధించి.. పట్టణాల్లో నిర్మించే గృహాలకు కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు కేంద్రం అమలు చేస్తున్న అందరికీ ఇళ్లు పథకం కింద కొంతమేర నిధులను సమీకరించాలని నిర్ణయించింది. ఇళ్ల నిర్మాణానికి కేంద్రం గతంలోనూ ఆర్థిక సాయం అందించింది.

పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి కేంద్రం మార్గదర్శకాలు వేర్వేరుగా ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో ఒక్కో ఇంటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.లక్షన్నర వరకు సహాయాన్ని అందిస్తుండగా.. గ్రామీణ ప్రాంతాల్లో ఆ మొత్తం తక్కువగా ఉండటంతోపాటు షరతులూ అధికంగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే ఇళ్లకు కేంద్రం కేవలం రూ.72 వేలు మాత్రమే అందజేస్తోందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలకు కేంద్రం నుంచి సహాయాన్ని తీసుకునే విషయంలో నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు వెచ్చించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పట్టణ ప్రాంతాల్లో కేంద్రం ఇచ్చే రూ.లక్షన్నర మినహాయించి మిగిలిన రూ.మూడున్నర లక్షలను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news