తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రాగానే…నల్లగొండ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకం మళ్లీ మొదలైంది. గత ఐదు రోజులుగా నాగార్జున సాగర్ లో మకాం వేసింది ఢిల్లీ బృందం. నల్లమల అటవి ప్రాంతాన్ని ఢిల్లీ నుంచి వచ్చిన యురేనియం అధికారులు బృందం…పరిశీలిస్తోంది.
నంబాపురం, పెద్దగట్టు, కోమటికుంట తండా ప్రాంతాల్లో గుడ్డు చప్పుడు కాకుండా ప్రతి రోజు 10 గంటల సమయంలో హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు అధికారులు. దీంతో భయాందోళనలో సమీప గ్రామ ప్రజలు ఉన్నారు. 2003లో యురేనియా కోసం ప్రజా అభిప్రాయ సేకరణ తీసుకున్నారు. గతంలో ప్రజాభిప్రాయ సేకరణ చేయనీయకుండా అధికారులను అడ్డుకున్నారు పెద్దగట్టు గ్రామస్తులు. కేసీఆర్ పాలనలో యురేనియం తవ్వకంపై పోరాటం చేశారు. దీంతో యురేనియం తవ్వకం ఆగిపోయింది. కానీ ఇప్పుడు మళ్లీ ప్రారంభం అయింది.