రాజమండ్రి అర్బన్ నుంచి సోము వీర్రాజు పోటీ ?

-

రాజమండ్రి అర్బన్ టిక్కెట్ పై గందరగోళం నెలకొంది. బిజెపి-టిడిపి-జనసేన పొత్తుతో ఈ పరిస్థితి నెలకొంది. రాజమండ్రి అర్బన్ టికెట్ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర మాజీ అధ్యక్షులు సోము వీర్రాజుకు కేటాయించాలని పట్టుబడుతోంది బిజెపి. రాజమండ్రి అర్బన్ బిజెపికి కంచుకోటగా ఉంటూ వస్తోంది. సోము వీర్రాజుకు టికెట్ కేటాయింపుపై టిడిపి పునరాలోచన చేయనుంది. పొత్తులో భాగంగా 2014 ఎన్నికల్లో 25 వేల పైచిలుకు ఓట్లతో గెలుపొందారు బిజెపి అభ్యర్థి.

Somu Veerraju

పొత్తు లేకుండా 2019లో టిడిపి అభ్యర్థి ఆదిరెడ్డి భవాని సుమారు 32వేలు ఆధిక్యంతో గెలుపొందారు. తొలి జాబితాలో రాజమండ్రి అర్బన్ టిడిపి టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే భర్త ఆదిరెడ్డి వాసుకు కేటాయించింది అధిష్టానం. 2014 ఎన్నికల పొత్తులో టిక్కెట్ వదులుకుంది టిడిపి. 2014 ఎన్నికల్లో అర్బన్ నుంచి రూరల్ కు టిడిపి సిటింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్య చౌదరి మారారు. 2014లో టిడిపి టిక్కెట్ వదులుకున్న పార్టీ శ్రేణులు సమిష్టిగా కలిసి పని చేయడంతో ఘనవిజయం సాధించారు బిజెపి అభ్యర్థి ఆకుల సత్యనారాయణ. ఇక ఇప్పుడు సోము వీర్రాజు కూడా గెలుస్తాడని అంటున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news