ఇన్నిరోజులు ఏం చేశారు.. ఎలక్టోరల్ బాండ్ల అంశంలో ఎస్‌బీఐ తీరుపై సుప్రీంకోర్టు ఫైర్

-

ఎన్నికల బాండ్ల వ్యవహారంలో స్టేట్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గత 26 రోజులుగా ఏం చేశారంటూ ఘాటుగా ప్రశ్నించింది. ఎన్నికల బాండ్ల వివరాలను వెల్లడి చేయడానికి గడువును జూన్‌ 30 వరకూ పొడిగించాలంటూ ఎస్‌బీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ గతన నెల ఇచ్చిన తీర్పు ప్రకారం విరాళాల వివరాలు వెల్లడించాలని ఆదేశించామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. ఇలా అదనపు సమయం కోరుతూ తమ వద్దకు రావడం తీవ్రమైన విషయమని అసహనం వ్యక్తం చేసింది.

‘గత 26 రోజుల నుంచి ఏం చర్యలు తీసుకున్నారు? మీ దరఖాస్తులో ఆ విషయాలు ఏవీ లేవు అని ఎస్బీఐని సూటిగా ప్రశ్నించింది. వెంటనే ఆ వివరాలు ఎన్నికల సంఘానికి ఇవ్వాలని’ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలకు రహస్యంగా నిధులు అందించడానికి వీలు కల్పించే ఎన్నికల బాండ్ల పథకాన్ని గత నెల 15న సుప్రీంకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. పార్టీలకు అందిన సొమ్ము, ఇచ్చిన దాతల వివరాలను ఈ నెల 6లోగా ఎన్నికల సంఘానికి అందించాలని ఎస్‌బీఐని ధర్మాసనం ఆదేశిస్తూ.. ఆ సమాచారాన్ని ఈ నెల 13లోగా బహిరంగపరచాలని ఈసీకి స్పష్టం చేసింది. ఈ క్రమంలో మరింత గడువు కావాలంటూ ఎస్‌బీఐ సుప్రీంను ఆశ్రయించింది. దీనిపై తాజాగా విచారణ జరిపింది.

Read more RELATED
Recommended to you

Latest news