యాదాద్రీశుడి సేవలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు

-

తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో ఇవాళ్టి నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు ప్రారంభమైన ఈ ఉత్సవాలు ఈనెల 21వ తేదీ వరకు నిర్వహించనున్నారు. 18న స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం, 19న దివ్య విమాన రథోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలిరోజైన నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వామి వారిని దర్శించుకున్నారు. సతీసమేతంగా ఆలయానికి వచ్చిన రేవంత్కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

స్వామి అమ్మవార్లకు రేవంత్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అనంతరం యాదాద్రీశుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్యేలు అనిల్‌, సామేలు, వీరేశం, లక్ష్మారెడ్డి ఉన్నారు. సీఎం దంపతులు, మంత్రులకు అర్చకులు వేదాశీర్వచనం ఇచ్చారు. సీఎం దంపతులకు ఆలయ ఛైర్మన్‌, ఈవో స్వామివారి జ్ఞాపిక, ప్రసాదం అందించారు.

Read more RELATED
Recommended to you

Latest news