ఏపీలో గీతాంజలి అనే యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన హాట్ టాపిక్ గా మారింది. ఈనెల 7వ తేదీన గీతాంజలి అనే యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. జగనన్న ఇల్లు తనకు వచ్చిందని… అమ్మ ఒడి పొందుతున్నట్లు తాజాగా ఇంటర్వ్యూలో పేర్కొంది గీతాంజలి. అయితే ఇల్లు వచ్చిన ఆనందంలో.. ఫుల్ జోష్ లో మాట్లాడింది గీతాంజలి.
అయితే ఇదే ఆమె కొంప ముంచింది. ఈ వీడియోను టిడిపి పార్టీ కార్యకర్తలు దారుణంగా ట్రోలింగ్ చేశారు. ఆమె క్యారెక్టర్ ను చాలా చీప్ గా చూపించే ప్రయత్నం చేశారు. దీంతో రైలు కిందపడి గీతాంజలి మరణించింది. ఈ తరుణంలో వైసిపి పార్టీ గీతాంజలి కుటుంబానికి అండగా నిలిచింది. తెనాలిలో గీతాంజలి నీటిపై బీసీ కమిషన్ సీరియస్ అయింది. గీతాంజలి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని… బీసీ కమిషన్ సభ్యుడు మారేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగానే రైల్వే అలాగే స్థానిక పోలీసులతో మాట్లాడారు మారేష్ కుమార్. సోషల్ మీడియాలో వేధింపులకు గురి చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని బీసీ కమిషన్ ఆదేశాలు ఇచ్చింది.