తెలంగాణ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. ఇవాళ 12 గంటలకు జరగాల్సిన కేబినెట్ సమావేశం మ.2.గం. వాయిదా పడింది. ఈ భేటీలో కీలక అంశాలు చర్చించే అవకాశం ఉంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ వ్యవహారం పై చర్చ జరిగే అవకాశం ఉంటుంది. మహిళలకు నెలకు 2500 రూపాయలపై ఇవాళ కేబినెట్ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
అలాగే ఎస్ హెచ్ జి మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీ పునరుద్ధరణ కార్యక్రమాన్ని కూడా చేపట్టేందుకు నిర్ణయం తీసుకోనున్నారు. అంతేకాకుండా 5 లక్షల రూపాయల జీవిత బీమా, కొత్త రేషన్ కార్డులపై నిర్ణయాలు తీసుకోనున్నారు రేవంత్ రెడ్డి. సాయంత్రం పరేడ్ గ్రౌండ్ లో జరిగే మహిళా శక్తి సభలో వీటిపై ప్రకటన చేసే ఛాన్స్ ఉంది.