తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త అందింది. ఇవాల్టి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయాయి. నిండు వేసవికాలం వచ్చేసింది. దీంతో ఎండలు విపరీతంగా కొడుతున్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలోనే ఇవాల్టి నుంచి ముట్టిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
దీంతో ప్రభుత్వం మరియు ప్రైవేటు స్కూళ్లు తప్పకుండా ఒంటిపూట బడులను అమలులోకి తీసుకురావాలని తెలంగాణ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. లేనిపక్షంలో అన్ని రకాల చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇక ఒంటి పూట బడుల ప్రకారం ఉదయం 8 గంటల నుంచి 12:30 గంటల వరకు పాఠశాలలు నడుస్తాయి. అనంతరం మధ్యాహ్నం భోజనం పెట్టి ఇంటికి పంపిస్తారు. విద్యా సంవత్సరం ముగిసే ఏప్రిల్ 23వ తేదీ వరకు ఒంటిపూట బడులు కొనసాగుతాయి. ఆ తర్వాత వేసవి సెలవులు వస్తాయి.