తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఐర్లాండ్ ప్రధాన మంత్రి లియో వరద్కర్ ప్రకటించారు. బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… వ్యక్తిగత, రాజకీయ కారణాల వలన తాను ప్రధాని పదవి నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. మరల నూతన నాయకుడిని ఎన్నుకునే వరకు పదవిలో కొనసాగుతుందని స్పష్టం చేశారు.
అలాగే, తన పార్టీ ఫైన్ గేల్ ప్రెసిడెంట్ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు.ఏప్రిల్ 6న పార్టీకి కొత్త నాయకుడిని ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు ఆయన తెలిపారు. పదవి నుంచి తప్పుకోవడానికి ఇది కరెక్టు టైం అని ఇక తన నిర్ణయం వెనుక అసలు కారణం ఏమీ లేదని అన్నారు.భవిష్యత్తుకు సంబంధించి వ్యక్తిగత లేదా రాజకీయ ప్రణాళికలు లేవని ఈ సందర్భంగా లియో వరద్కర్ వెల్లడించారు. కాగా, 2017లో, వరద్కర్ తొలిసారిగా అధికారం చేపట్టారు. ఆయన దేశంలోనే అతి అతి చిన్న ప్రైమ్ మినిస్టర్ గా ,ఆ పదవిని నిర్వహించిన మొదటి స్వలింగ సంపర్కుడిగా నిలిచారు.