OG:ఓజి నుంచి బాలీవుడ్ హీరో పిక్ రిలీజ్

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ఓ జి.. ముంబై బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టార్ డ్రామాగా సుజీత్ దర్శకత్వంలో ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ మూవీ తెరకెక్కుతోంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా పైన ఉన్నంత బజ్ పవన్ నటిస్తున్న ఇంకే సినిమా పైన లేదని చెప్పాలి. పవన్ గ్యాంగ్ స్టర్ గా కనిపించనుండంతో మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఇకపోతే షూటింగ్ అప్డేట్, లొకేషన్ అప్డేట్స్, ఫస్ట్ లుక్ ఇలా ప్రతి విషయంపై కూడా ఎప్పటికప్పుడు అభిమానులకు కిక్కిచ్చే వార్తలను మేకర్స్ రిలీజ్ చేస్తూనే వస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన మూవీ గ్లింప్స్ రికార్డ్ వ్యూస్ని సొంతం చేసుకుంది.తాజాగా మూవీలో విలన్ పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఫొటోను యూనిట్ షేర్ చేసింది.యుద్ధాన్ని ఊహించలేరు అంటూ క్యాప్షన్ ఇచ్చింది.సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో ప్రియాంకా మోహన్ హీరోయిన్గా నటిస్తున్నారు. మరోవైపు శ్రియారెడ్డి కీలక పాత్రలో నటిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news