విజయవాడలో మాజీ మంత్రి దేవినేని ఉమ పై కేసు నమోదు

-

దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ట్రాఫిక్‌కి కారణమై ప్రజలకు ఇబ్బందులకు గురి చేశారన్న కారణంతో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమతోపాటు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జక్కంపూడి కాలనీలో టీడీపీ జెండాలతో ఆయన ర్యాలీ నిర్వహించారు. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారని పలువురు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు మేరకు విచారించి.. ఎలాంటి అనుమతి తీసుకోకుండా ర్యాలీ నిర్వహించారని పోలీసులు ఆరోపించారు. ఎన్నికల కమీషన్ నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీ చేశారంటూ దేవినేని ఉమ సహా మరి కొందరు టీడీపీ నేతలపై కేసు నమోదు చేశారు. పోలీసుల తీరుపై ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ప్రశాంతంగానే ర్యాలీ నిర్వహించామని.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదని అన్నారు. వైసీపీ నేతలే అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news