అతి పెద్ద డ్రగ్స్ లింక్‌ను ఛేదించిన పంజాగుట్ట పోలీసులు

-

హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు అతి పెద్ద డ్రగ్స్ లింక్‌ను ఛేదించారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు, వారి నుంచి పలు రకాల డ్రగ్స్, గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వారికి పలు నగరాల డ్రగ్ డీలర్లతో సంబంధాలున్నట్లు గుర్తించారు. పాలస్తీనా వాసి సయీద్ అలీ, ముంబయి వాసి రోమిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల లిస్టులో హైదరాబాద్‌కు చెందిన 31 మంది వినియోగదారులు ఉన్నట్లు గుర్తించారు. వారి కాంటాక్టులోని స్మగ్లర్లు, వినియోగదారుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సౌదీ అరేబియాకు చెందిన సయీద్‌ అలీ మహ్మద్‌ అలియాస్‌ సయీద్‌ విద్యార్థి వీసా తీసుకుని సోదరుడితో కలిసి 2009లో హైదరాబాద్‌ వచ్చాడు. వీసా గడువు ముగిసినా అక్రమంగా దేశంలో ఉంటూ 2018లో ఆధార్‌ కార్డు, పాన్‌కార్డు, బ్యాంకు ఖాతా సంపాదించాడు. కొన్నాళ్లుగా బంజారాహిల్స్‌లో ఉంటూ డ్రగ్స్‌కు అలవాటుపడ్డ సయీద్‌ నగరంలో విక్రయాలు మొదలుపెట్టాడు. గోవా, బెంగళూరు, ముంబయిలో ఉండే నైజీరియన్లు, ఇతర స్మగ్లర్ల నుంచి డ్రగ్స్‌ కొనుగోలు చేసి హైదరాబాద్‌లో అమ్ముతున్నాడు.

మరోవైపు ముంబయికి చెందిన రోమీ ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి డ్రగ్స్‌కు అలవాటుపడ్డాడు. ఇండియాకు తిరిగొచ్చాక…గోవాలో ఉండే నైజీరియన్‌ క్రిస్‌ ద్వారా మత్తు పదార్థాలు తెప్పిస్తూ విక్రయాలు ప్రారంభించాడు. గతేడాది నుంచి సయీద్‌కు డ్రగ్స్‌ అమ్ముతున్నాడు. ఈనెల 23న పంజాగుట్ట మెట్రోస్టేషన్‌ వద్ద సయీద్‌కు విక్రయిస్తుండగా పోలీసులు ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news