సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు రీల్స్ మోజులో పడి కొందరు ఎంతటి అసభ్యకరమైన పనులు చేసేందుకు సిద్ధమవుతున్నారు. కొందరు పాపులారిటీ కోసం ఎంచుకుంటున్న మార్గాలు జుగుప్సను కలిగిస్తున్నాయి. తాజాగా దిల్లీలో ఉత్తర్ ప్రదేశ్లోని నోయిడాలో హోలీ సెలబ్రేట్ చేసుకుని బైక్పై వెళ్తుండగా ఇద్దరు యువకులు రంగులు పూసుకుంటూ అసభ్యకరంగా ప్రవర్తించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. వీడియోలో ఒక యువకుడు స్కూటర్ నడుపుతుండగా.. వెనుక ఇద్దరు అమ్మాయిలు ఎదురెదురుగా కూర్చొని ఒకరికొకరు హోలీ రంగులు పూసుకొంటూ అసభ్యకరరీతిలో ప్రవర్తించిన దృశ్యాలు రికార్డయ్యాయి.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నోయిడా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఆ వీడియోలో బైక్పై ఉన్న ముగ్గురికీ రూ.33వేలు జరిమానా విధించారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఈ-చలానా జారీ చేసినట్లు నోయిడా పోలీసులు వెల్లడించారు. ఈ వీడియోపై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ వీడియోలో కనిపిస్తున్న యువతులపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు అధికారులను కోరుతున్నారు.
Greater Noida Video
होली के नाम पर अश्लीलता फैलाने वाली सुशील कन्याएं, दिल्ली मेट्रो का असर ग्रेटर नोएडा तक पहुंच गया, इसको नीचता की हद बोलेंगे या रील्स का भूत।
ट्रैफिक नियमों का उल्लंघन भी है। स्कूटी नंबर (UP16CX-0866)@noidapolice @Uppolice @dgpup #viralvideo pic.twitter.com/DyJQD0Xy37
— Mayank Tawer (@mayank_tawer) March 25, 2024