కాంగ్రెస్‌ పార్టీకి మరోసారి ఐటీ నోటీసులు

-

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆదాయపు పన్ను అంశంలో కాంగ్రెస్‌కు మరోసారి షాక్ తగిలింది. ఈ పార్టీకి ఐటీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని 2017-18, 2020-21 మదింపు సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీ వసూలుకు రూ.1700 కోట్ల డిమాండ్‌ నోటీసులు ఇచ్చినట్లు కాంగ్రెస్‌ నేత వివేక్‌ తంఖా తెలిపారు. తమపై ఐటీ విభాగం ప్రక్రియను నిలిపివేయాలంటూ పార్టీ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసిన వెంటనే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం.

ఎలాంటి మదింపు ఉత్తర్వులు, పత్రాలు లేకుండానే తాజా నోటీసులిచ్చారు. ఇది అహేతుక, అప్రజాస్వామిక చర్య. లోక్‌సభ ఎన్నికల వేళ ప్రధాన ప్రతిపక్ష పార్టీని ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. దీన్ని తాము చట్టపరంగా సవాల్‌ చేస్తాం. అని వివేక్ తంఖా అన్నారు.

2017 నుంచి 2021 మధ్య కాలానికి ఐటీ విభాగం చేపట్టిన పునఃపరిశీలన ప్రక్రియను నిలిపివేయాలంటూ కాంగ్రెస్‌ దాఖలు చేసిన పిటిషన్లను గురువారం దిల్లీ హైకోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. మదింపు ప్రక్రియ చేపట్టేందుకు అవసరమైన ఆధారాలు ఐటీ అధికారుల దగ్గర ఉన్నాయని, ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news