నష్టపోయిన తెలంగాణ రాష్ట్ర రైతులకు రేపో, ఎల్లుండో ఆర్ధిక సాయం చేస్తామని తెలిపారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు. రాళ్ల వాన ద్వారా సుమారు 40,000 ఎకరాలు దెబ్బతిన్నదని మాకు లెక్క వచ్చింది.. రేపో,ఎల్లుండో ఎకరానికి రూ.10,000 చొప్పున ఆర్థిక సాయం చేస్తామని వెల్లడించారు. సంక్షోభంలో ఉన్న తెలంగాణ సర్కార్ ను..సంక్షేమం వైపు తీసుకువెళ్తున్నామన్నారు.
అధికారం పోయింది అని బాధలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారన్నారు. కేటీఆర్ మొదటి సారి పంట పొలాల్లోకి వెళ్ళాడని చురకలు అంటించారు. మొదటి పంటకు నీళ్లు ఇవ్వని మీరు.. రెండో పంటకు నీళ్లు ఇవ్వాలని అడుగుతున్నారని మండిపడ్డారు. పంటలు బోర్ల కింద ఎండిపోయాయి….రైతులకు భరోసా ఇవ్వండి కానీ దగుల్భాజి మాటలు మానుకోండని ఫైర్ అయ్యారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు.