ఆకాశాన్ని తాకుతున్న ఉల్లి ధరలకు ఉల్లి ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంత ప్రయత్నిస్తున్నా ఫలితం లేకపోతోంది. ఉల్లిపాయల ధరలు ఆకాశాన్ని దాటి అంతరిక్షంలోకి వెళ్లాయి. బెంగళూరుకు రావాల్సిన ఉల్లిపాయల సరఫరా గణనీయంగా తగ్గిపోవడంతో, కిలో ఉల్లి ధర ఏకంగా రూ. 200కు చేరింది. “రిటైల్ షాపుల్లో ధరలు మరింతగా పెరిగాయి. హోల్ సేల్ వ్యాపారులు క్వింటాలుకు రూ. 14 వేలు పెట్టి ఉల్లిని కొనుగోలు చేయాల్సి వస్తోంది” అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మార్కెటింగ్ ఆఫీసర్ సిద్ధనాగయ్య వ్యాఖ్యానించారు.
ఇక బెంగళూరులోని రెస్టారెంట్లు ఇప్పటికే ఉల్లిపాయల వాడకాన్ని ఆపివేయగా, ప్రజలు కూడా వాడకాన్ని తగ్గించేశారు. అలాగే దేశవ్యాప్తంగా పలు చోట్ల కూడా కిలో ఉల్లి రూ.200 దాటేసింది. మరోవైపు ఉల్లి ఖరీదైన వస్తువుగా మారిపోవడంతో పలు చోట్ల ఉల్లి దొంగతనాలు జరగుతున్న విషయం తెలిసిందే.