కడియం శ్రీహరి ఎమ్మార్పీఎస్ మీద వ్యక్తిగత విమర్శలు చేశారని, ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఫైర్ అయ్యారు. స్వార్ధాన్ని అవకాశవాదాన్ని కప్పిపుచ్చుకోవడానికి మా మీద నిందారోపణ చేసే ప్రయత్నం చేశారని అన్నారు. తన బిడ్డ భవిష్యత్తు కోసమే అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు.
పక్కవాళ్ళ ఎదుగుదలని జీవించుకోలేక కుళ్ళు బుద్ధి ఉన్న వ్యక్తి కడియం శ్రీహరి అని ఫైర్ అయ్యారు. తాటికొండ రాజయ్య ఎదుగుదల్ని అడ్డుకునేందుకు కుట్రలు చేశారని కూడా అన్నారు. తన రాజకీయ జీవితంలో తాను మాత్రమే ఎదిగాడు. ఇప్పుడు తన కూతురు ఎదుగుదలకి తపన పడుతున్నాడని చెప్పారు. లేనిపోని మాటలు చెప్పి మాదిగల ఎదుగుదలకు అడ్డుపడుతున్నారని ఆరోపించారు.