ఎన్నికల వేళ ఆప్ నేతలు సంచలన నిర్ణయం..!

-

లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే ఈడి అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్నారు. ఇంకోవైపు లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన వ్యక్తి ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోవడానికి అర్హుడు కాదని విపక్ష బిజెపి ఆరోపణలు గుప్పిస్తోంది. అయినా పదవికి రాజీనామా చేయలేదు. దేశ చరిత్రలో అరెస్ట్ అయిన వ్యక్తి తమ పదవులకి రాజీనామా చేసిన చరిత్ర అయితే ఉంది.

ఇటీవల ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరన్ అరెస్ట్ అయ్యే ముందు తన పదవికి రాజీనామా చేశారు. ఆ విషయంలో మాత్రం కేజ్రీవాల్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నప్పటికీ జైలు నుండి నాయకుడు రాష్ట్రాన్ని పాలిస్తారని ఆప్ నేతలు అంటున్నారు. ఈ క్రమంలో తీహార్ జైల్లో రాజీనామా చేసేలా కనిపించట్లేదు. ఈ క్రమంలో పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఢిల్లీ సీఎం తర్వాత ఎవరు అనే దానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. అయితే సునీత కేజ్రీవాల్ పేరు ఢిల్లీ సీఎం గా ప్రముఖంగా వినపడుతోంది. సునీత ఐఆర్ఎస్ ఆఫీసర్గా పదవీ విరమణ పొందరు సీఎం అవ్వడానికి అన్ని అర్హతలు ఆమెకి ఉన్నాయని ఆప్ వర్గాలు అంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news