తెలంగాణ వ్యాప్తంగా ఎండలు బాగా మండుతున్నాయి అనూహ్యంగా పెరిగిన ఉష్ణోగ్రతలతో జనం ఇబ్బంది పడుతున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 44° చేరువుగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా ఉష్ణోగ్రతలు మరింత తిరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంటున్నారు.
ఇప్పటికే నల్లగొండ జిల్లా నిడమనూరులో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు చేసుకుంది ఎల్లుండి వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ అంటోంది. ఉదయం 11 నుండి మధ్యాహ్నం మూడు గంటల దాకా ఎండలు తీవ్రత ఎక్కువగా ఉండబోతుందని తెలుస్తోంది రాష్ట్రంలో ఉష్ణోగ్రత ఈరోజు 43 డిగ్రీలు దాటింది నల్లగొండ జిల్లా నిడమనూరులో 43.5° టేక్యా తండాలో 43.4 నాంపల్లిలో 43 2 ఇలా పలుచోట్ల 43 డిగ్రీలు దాటింది.