లేడీ సూపర్ స్టార్ గా నయనతార పేరు తెచ్చుకుంది. 2022లో డైరెక్టర్ విగ్నేష్ శివన్ ని ప్రేమ పెళ్లి చేసుకుంది. సరోగసి ద్వారా ఇద్దరు మగ పిల్లలకి జన్మనిచ్చింది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో తన సత్తాను చాటుతోంది. ఇటీవల సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ మూవీలో నయనతార నటించిన తాజాగా తన తండ్రి పుట్టిన రోజు కావడంతో చిన్నప్పుడు తన తండ్రితో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేసింది.
హ్యాపీ బర్త్డే మై హీరో మై లవ్ అంటూ ఆమె పోస్ట్ చేసింది. నేను మా అమ్మ నాన్న అందరం కలిసి కూర్చుని మాట్లాడుకోవడం చాలా అరుదు అని నయనతార అంది. పనిలో రాజీ పడకపోవడం ఫ్యామిలీకి ప్రాధాన్యతనివ్వం క్రమశిక్షణ ఇవన్నీ మాకు మా నాన్న నేర్పించారు మాకు ఊహ తెలిసినప్పటి నుండి మా నాన్న మా హీరో ఆయన మంచి ఆయన నుండి ఎన్నో నేర్చుకున్నాను కష్ట సమయంలో ఎలా నిలబడాలో నాన్న నుండి నేర్చుకున్నాను అని నాయనతర ఎమోషనల్ అయింది.