బాక్సాఫీస్ వద్ద సిద్ధూ జోరు.. రూ.100 కోట్ల క్ల‌బ్‌లో ‘టిల్లు స్క్వేర్’

-

టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ లేటెస్ట్ మూవీ టిల్లు స్క్వేర్ బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు సృష్టిస్తోంది. టీజర్ రిలీజ్ నుంచి ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేసిన ఈ చిత్రం థియేటర్లలో దూసుకెళ్తోంది. మొదటి రోజు నుంచి కాసుల వర్షం కురిపిస్తూ తాజాగా ఏకంగా వంద కోట్ల రూపాయల క్లబ్ లో చేరిపోయింది. ఫ‌స్ట్ డే రోజే వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ. 23.7 కోట్లు రాబ‌ట్టిన ఈ చిత్రం మూడు రోజుల్లో రూ.50 కోట్లకు పైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. తాజాగా ఈ సినిమా 10 రోజుల్లో రూ.101 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది.

ఈ విష‌యాన్ని సితార ఎంట‌ర్‌టైన‌మెంట్స్ సోష‌ల్ మీడియాలో పోస్టు చేసింది. డీజే టిల్లుకు సీక్వెల్‌గా ఈ మూవీ రావ‌డంతో ప్రేక్ష‌కులు ఎగ‌బ‌డి ఈ సినిమాకు వెళ్తుండటంతో వసూళ్ల వర్షం కురుస్తోంది. ఇక ఉగాది, రంజాన్ పండుగులు ముందున్న నేపథ్యంలో కలెక్షన్లు మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక థియేటర్లలో ది ఫ్యామిలీ స్టార్ సినిమా మాత్రమే చెప్పుకోదగ్గ సినిమా అయినా టిల్లూ వైపే ప్రేక్షకులు మొగ్గుచూపుతున్నారు. అనపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా న‌టించిన ఈ చిత్రాన్ని మల్లిక్‌రామ్ తెరకెక్కించారు.

Read more RELATED
Recommended to you

Latest news