నేడు సంపూర్ణ సూర్యగ్రహణం.. ఈ ఏడాదిలో అతిపెద్ద ఖగోళ ఘటన

-

విశ్వంలో నేడు అద్భుత దృశ్యం ఆవిష్కృతం కాబోతోంది. నేడు సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ ఏడాది సంభవించే అతిపెద్ద ఖగోళ ఘటన ఇదేనని ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు. ఉత్తర అమెరికా, కెనడా మీదుగా ఈ గ్రహణం ఏర్పడుతుందని చెబుతున్నారు. పైగా అరుదుగా ఏర్పడే సంపూర్ణ గ్రహణం కావడంతో దీన్ని చూసేందుకు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ ఘట్టాన్ని అంతరిక్షంలో ఉన్న మన ‘ఆదిత్య’ మాత్రం చూడలేడట. ఎందుకంటే ‘ఆదిత్య ఎల్‌ 1 (Aditya L1)’ను ఉంచిన స్థానమే దీనికి కారణమట.

నేటి సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలో భానుడిని పూర్తిగా కమ్మేసే చంద్రుడు ఈ శాటిలైట్‌కు వెనుకవైపు ఉంటాడట. సూర్యుడికి, చంద్రుడికి మధ్యలో అన్నమాట..! అందుకే గ్రహణ ఘట్టాన్ని ‘ఆదిత్య ఎల్‌ 1’ వీక్షించలేదని ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌. సోమనాథ్‌ తెలిపారు. నేటి సంపూర్ణ సూర్య గ్రహణం మెక్సికో, అమెరికా, కెనడాల మీదుగా ప్రయాణించనుండటంతో ఈ ప్రాంతాల్లో గ్రహణ ప్రభావాన్ని బట్టి కొన్ని నిమిషాల పాటు చీకటి కమ్ముకోనుందని నిపుణులు తెలిపారు. అయితే, భారత్‌లో దీని ప్రభావం లేదు. మన కాలమానం ప్రకారం నేటి రాత్రి 9 గంటల తర్వాత నుంచి రేపు తెల్లవారుజామున 2.22 గంటల వరకు గ్రహణ కాలం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news