మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి భారీ విరాళం ఇచ్చారు. ఇవాళ పోచంపల్లిలో విశ్వంభర మూవీ షూటింగ్ సమయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ కి రూ.5 కోట్ల చెక్కు అందజేశారు.దీంతో జనసేన పార్టీ ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఎక్స్(ట్విట్టర్) లో ట్వీట్ చేసింది.
ఈ నేపథ్యంలో జనసేన పార్టీకి రూ.5 కోట్లు విరాళం ఇవ్వడంపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ‘అందరూ అధికారంలోకి వచ్చిన తరువాత సాయం చేస్తాం అంటారు. అధికారం లేకపోయినా, తన సంపాదనని రైతు కూలీల కోసం పవన్ కళ్యాణ్ వినియోగించటం నాకు సంతోషాన్ని కలిగించింది అని మెగాస్టార్ తెలిపారు. తన స్వార్జితం సమాజం కోసం ఖర్చు పెట్టే మనసున్న తమ్ముడు పవన్ లక్ష్యానికి కొంతైనా ఉపయోగపడుతుందని నేను సైతం జనసేనకి విరాళాన్ని అందించా’ అని చిరంజీవి పేర్కొన్నారు.కాగా చిరంజీవి కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు.