తాడేపల్లిలోని సిట్ ప్రాంగణంలో సిబ్బంది హెరిటేజ్ కు చెందిన పలు పత్రాలను కాల్చారని తెలుగుదేశం పార్టీ తాజాగా ఆరోపించింది. అందుకు సంబంధించినవిగా చెబుతున్న వీడియోలను ట్విటర్లో పంచుకుంది. సీఐడీ చీఫ్ ఆదేశాల మేరకే కీలక పత్రాలను సిబ్బంది తగులబెట్టారని టీడీపీ మండిపడింది. చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులో కీలక పత్రాలు కావడంతో సాక్ష్యాలు లేకుండా వాటిని నాశనం చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఇదిలా ఉంటే… తాడేపల్లి సీఐడీ సిట్ కార్యాలయం సమీపంలో హెరిటేజ్ పత్రాలు దహనం చేసిన ఘటనపై సీఐడీ స్పందించింది. ‘ఐదు కేసుల్లో విజయవాడ ఏసీబీ కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేశాం అని తెలిపారు. ఒక్కో దానిలో 8 వేల నుంచి 10వేల పేజీలున్నాయి. కొన్ని పత్రాలు అస్పష్టంగా ప్రింట్ అయ్యాయి. వాటిని దహనం చేశాం అని తెలిపారు. కేసులకు సంబంధించిన అన్ని ఆధారాలు కోర్టుకు సమర్పించాం’ అని సీఐడీ ప్రకటించింది.