ఆ సినిమాలో సమంతను వద్దనుకున్నా: డైరెక్టర్ సుకుమార్

-

సుకుమార్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వచ్చిన సినిమా రంగస్థలం.అయితే ఈ సినిమా ఏ రేంజ్ లో సూపర్ హిట్ సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమాలో నటించిన హీరోయిన్ సమంతపై డైరెక్టర్ సుకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షూటింగ్లో సమంతను మేనేజ్ చేయడం కష్టమని చెప్పారు. తొలుత రంగస్థలంలో ఆమెను వద్దనుకున్నా.. కానీ షూటింగ్ సమయంలో ఆమె నటన చూసి ఆశ్చర్యపోయినట్లు సుకుమార్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రతి సీన్లో ఆమె హావభావాలు అద్భుతమని సమంతపై ప్రశంసల వర్షం కురిపించారు. రంగస్థలంలో ఆ పాత్రకు సమంత తప్ప ఇంకెవరూ న్యాయం చేయలేకపోయారని సుకుమార్ కొనియాడారు.

కాగా, డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పుష్ప 2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా రష్మిక నటిస్తోంది.కాగా ఈ ఏడాది ఆగస్టు 15న పుష్ప 2 ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నహాలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news