కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆసక్తికరమైన ట్విట్ చేశారు. కాంగ్రెస్ బిజెపి పార్టీల సిద్ధాంతాల మధ్య సారూప్యతను పోల్చుతూ ట్విట్టర్ వేదికగా అభిప్రాయాన్ని చెప్పారు. ఈ ఎన్నికలు రెండు సిద్ధాంతాల మధ్య పోరు అని అన్నారు. ఒక వైపు భారత దేశాన్ని ఎప్పుడు సమైక్యంగా ఉంచిన కాంగ్రెస్ ఇంకో పక్క ప్రజల్ని విభజించే ప్రయత్నం చేసేవారు.
మరోవైపు ప్రజలను విభజించేలా ఉన్నారని అన్నారు అలానే దేశాన్ని విభజించారనుకునే శక్తులతో చేతులు కలిపి వాళ్లని బలోపేతం చేసి దేశ సమైక్యత స్వతంత్రం కోసం ఎవరు పోరాడారో చరిత్ర సాక్షి అని క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో బ్రిటిష్ వాళ్ళకి ఎవరు అండగా నిలిచారు అని పోస్ట్ చేశారు రాహుల్ గాంధీ. ప్రస్తుతం రాహుల్ గాంధీ చేసిన పోస్ట్ సంచలనంగా మారింది.