తాము బరిలో ఉన్నప్పుడు ఎంతటి లక్ష్యమైనా సురక్షితం కాదని ఇతర జట్లు గుర్తు పెట్టుకోవాలని గుజరాత్ కెప్టెన్ గిల్ హెచ్చరించారు. ‘లక్ష్యమెంతైనా చివరి వరకు పోరాడుతాం. ప్రత్యర్థులు గుజరాత్ టైటాన్స్ ని తేలిగ్గా తీసుకోవద్దు అని సూచించారు. నిన్నటి మ్యాచ్లో 3 ఓవర్లలో 45 రన్స్ చేయడం కష్టమేమీ కాదు అని అన్నారు . ఇద్దరు బ్యాటర్లు 9 బంతుల్లో 22 రన్స్ చేయాలి. ఓవర్లో 2 లేదా 3 బంతులను ఎటాక్ చేస్తే చాలు. రషీద్ ఖాన్, తెవాటియా అదే చేశారు’ అని కొనియాడారు.
కాగా, నిన్న రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్లో ఈ సీజన్ నెంబర్ వన్ జట్టును గుజరాత్ టైటాన్స్ మట్టి కల్పించింది. ఈ మ్యాచ్ లో కేవలం 3 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది.
చివరి వరకు పోరాడి జట్టును గెలిపించాడు ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ రషీద్ ఖాన్. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్… చివరి వరకు పోరాడింది. చివర్లో తేవాటియ, రషీద్ ఖాన్ ఆకట్టుకోవడంతో ఏడు వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది.