తన అన్నయ్య చిరంజీవి మార్షల్ ఆర్ట్స్, నటన అనే స్కిల్స్ నేర్పించడం వల్లే ఇవాళ తాను ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నానని పవన్ కళ్యాణ్ తెలిపారు.కోనసీమ అంబేడ్కర్ జిల్లా పి. గన్నవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… ‘ఆ స్కిల్స్ నన్ను కోట్ల మంది ముందు నిలబెట్టాయి. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తే యువత సొంతంగా సంపాదించుకుంటారు. అందుకే యువత నైపుణ్యాలు మెరుగుపర్చేలా కష్టపడుతున్నాం అని అన్నారు. సంక్షేమ పథకాలూ ఏవీ ఆపం. మరో పది రూపాయలు ఎక్కువే ఇస్తాం’ అని ఆయన హామీనిచ్చారు.
డొక్కా సీతమ్మ పుట్టిన నేల ఇదని చెప్పారు. పూలే జయంతి, ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ తెలిపారు.జగన్ కోనసీమకు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు.ముఖ్యమంత్రి జగన్ 2022 జూలైలో పర్యటించి రూ. 30 కోట్లు హామీ ఇచ్చి ఒక్క రూపాయి కూడా ఎందుకు విడుదల చేయలేదని నిలదీశారు. ఆడబిడ్దలకు రక్షణ కల్పించలేని వైసీపీ ప్రభుత్వం మనకు అవసరం లేదని ఆయన అన్నారు.