నాలుగు మ్యాచుల్లో రాణించనంత మాత్రాన అతను చెత్త బౌలర్ కాదు : గంభీర్

-

మిచెల్ స్టార్క్ను కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ చరిత్రలోనే భారీ ధర(₹24.75cr)కు కొనుగోలు చేసింది. ఈ సీజన్ తొలి 4 మ్యాచుల్లో అతడు కేవలం 2 వికెట్లే తీశారు.దీంతో అతడిపై వేటు వేయాలని అభిమానులు కోరుతుండగా గంభీర్ స్పందించారు. ‘నాలుగు మ్యాచుల్లో రాణించనంత మాత్రాన స్టార్క్ చెత్త బౌలర్ కాదు అని అన్నారు.ఒక్కసారి ఫామ్ అందుకుంటే ఎంత ప్రమాదకర బౌలరో మనందరికీ తెలుసు. తదుపరి మ్యాచుల్లో రాణిస్తాడనే నమ్మకం మాకుంది’ అని గంభీర్ చెప్పారు.

కాగా, ఈడెన్ గార్డెన్స్ వేదికగా లక్నోతో జరిగిన మ్యాచ్లో కోల్కతా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతుంది. తొలుత బ్యాటింగ్కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. తర్వాత లక్నో విధించిన 162 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా నైట్ రైడర్స్ 15.4 ఓవర్లలోనే ఛేదించింది. సాల్ట్ 47 బంతుల్లో 89 పరుగులతో రాణించాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (38 బంతుల్లో 38 రన్స్) రాణించారు.

Read more RELATED
Recommended to you

Latest news