సీఎం జగన్ కు గాయంపై పవన్ కళ్యాణ్ స్పందన

-

నిన్న విజయవాడలో సీఎం జగన్ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మేమంతా సిద్ధం బస్సు యాత్రలో పాల్గొన్నారు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు జగన్ పై రాయితో దాడి చేశారు.ఈ ఘటనలో సీఎం జగన్ ఎడమ కన్నుకి గాయం అయింది.రాయి బలంగా తగలడంతో కన్ను వాచింది. ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు.గుంటూరు జిల్లా తెనాలిలో వారాహి విజయ భేరి యాత్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ‘ ‘రాయి పడింది అని.. రాష్ట్రానికి గాయమైందని వైసీపీ నేతలు బాధపడుతున్నారు. అక్కను ఏడిపిస్తున్నారని ఎదిరించిన 15 ఏళ్ల అమర్నాథ్ గౌడ్ను చెరుకు తోటలో పెట్రోల్ పోసి కాల్చేశారు. పసిబిడ్డను కాల్చేస్తే రాష్ట్రానికి గాయం కాలేదా? వేల మంది అమ్మాయిలు అదృశ్యమైతే రాష్ట్రానికి గాయం కాలేదా?’ అని పవన్ ప్రశ్నించారు.

జగన్కు చిన్న గాయమైతే రాష్ట్రమంతా ఊగిపోతుందని.. సగటు మనిషికి గాయమైతే మనకు బాధ లేదా? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ‘జగన్కు గాయమైతే నాకు బాధగా ఉంది. ఇది నిజమో అబద్ధమో ఎవరికి తెలుసు? నాన్న పులి కథ ఒకసారి చెబితే బాగుంటుంది. ఎన్నికలు వచ్చినప్పుడల్లా చెబితే ఎవరు నమ్ముతారు? అని అన్నారు.ఈ నాటకాలు ఆపండి చాలు. భరించలేకపోతున్నాం అసహనం వ్యక్తం చేశారు. ప్రజలు కూడా ఇలాంటి డ్రామాలను నమ్మకండి’ అని ఆయన కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news