సిద్దిపేటలో సెర్ప్‌ ఉద్యోగుల సస్పెన్షన్‌పై హైకోర్టు స్టే

-

సిద్దిపేట సెర్ప్‌ ఉద్యోగుల సస్పెన్షన్‌పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. అనంతరం తదుపరి విచారణను హైకోర్టు జూన్‌ 18కి వాయిదా వేసింది. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ మెదక్‌ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారనే కారణంతో 106 మందిని ఇటీవల జిల్లా కలెక్టర్‌ మనుచౌదరి వారిని సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. వీరిలో 38 సెర్ప్ ఉద్యోగులు, 68 మంది ఉపాధి హామీ పథకానికి చెందిన వారున్నారు.

అయితే సెర్ప్‌ ఉద్యోగుల సస్పెన్షన్‌పై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. సస్పెండ్‌ చేసే అధికారం కలెక్టర్‌కు లేదని సెర్ప్‌ ఉద్యోగుల తరఫు న్యాయవాది వాదనలు వినిపించగా.. వాదనలు విన్న హైకోర్టు ఈ కేసుపై స్టే విధించింది.

ఇదీ అసలు జరిగిన విషయం.. ఏప్రిల్‌ 7న సిద్దిపేటలోని రెడ్డి సంక్షేమ భవన్‌లో ఉపాధి హామీ, సెర్ప్‌ ఉద్యోగులతో మెదక్‌ లోక్‌సభ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, సుడా మాజీ ఛైర్మన్‌ రవీందర్‌ రెడ్డి, మరికొందరు నాయకులు సమావేశం నిర్వహించారు. ఇది బహిర్గతం కావడంతో వెంకట్రామిరెడ్డి, రవీందర్‌రెడ్డిపై కేసు నమోదు కావడంతో పాటు ఉద్యోగులను అధికారులు సస్పెండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news