నేడు సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల షెడ్యూల్ ఇదే

-

 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇవాళ కొత్తగూడెం, వనపర్తి జిల్లాలో పర్యటించనున్నారు. ఖమ్మం నియోజకవర్గ పరిధిలో ఇప్పటికే జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి, ఇద్దరు మంత్రులు జోరుగా ప్రచారం నిర్వహిస్తుండగా, ముఖ్యమంత్రి సభ విజయవంతం చేసేందుకు శ్రేణులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నాయి. హైదరాబాద్‌ నుంచి కొత్తగూడేనికి సీఎం ప్రత్యేక హెలికాప్టర్‌లో రానున్నారు.

కొత్తగూడెం సభ అనంతరం మహబూబ్‌నగర్‌ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డికి మద్దతుగా రేవంత్‌రెడ్డి ప్రచారం నిర్వహిస్తారు. వనపర్తి జిల్లా కొత్తకోటలో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం కార్నర్‌ మీటింగ్‌లో పాల్గొంటారు. వనపర్తి పర్యటన అనంతరం, సికింద్రాబాద్‌, ముషీరాబాద్‌ కార్నర్‌ మీటింగ్స్‌లోనూ రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు.

మరో వారం రోజులే గడువుండటంతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రాష్ట్రమంతా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. వరుస సభలు, కార్నర్ మీటింగుల్లో పాల్గొంటూ బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటును అవమానించిన భారతీయ జనతా పార్టీకి ఓట్లడిగే హక్కు లేదని దుయ్యబట్టారు. భారత్ రాష్ట్ర సమితి అంటే బిర్లా రంగా సమితిగా అభివర్ణించారు. రిజర్వేషన్ల రద్దుపై ఆ రెండు పార్టీలది ఒకే విధానమని రేవంత్‌ రెడ్డి విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news