APRTC: ఏపీ ఎన్నికలు…హైదరాబాద్‌, బెంగళూరు నుంచి ప్రత్యేక బస్సులు

-

APRTC: ఏపీ ఎన్నికల నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ కీలక ప్రకటన చేసింది. మే 13 న సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో ఏపిఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపనుంది.మే 8 నుండి 12 తేదీ వరకు హైదరాబాద్ నుండి వివిధ ప్రాంతాలకు రెగ్యులర్ గా నడిచే సర్వీసులతో పాటు అదనపు సర్వీసులు ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్ నుండి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు రోజూ నడిచే 339 సర్వీసులతో పాటు 11 వ తేదీన 302 మరియు 12 వ తేదీన 206 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నారు.


ఈ రోజు హైదరాబాద్ నుండి ఒంగోలు 38, ఏలూరుకు 20 బస్సులు, మచిలీపట్నం కు 23, విజయవాడకు 45, గుంటూరు 18, నరసరావు పేట 26, నెల్లూరు 17, నంద్యాల 19, విశాఖపట్నం 4 ప్రత్యేక బస్సులు నడువనున్నాయి. హైదరాబాద్ — బి. హెచ్. ఈ. ఎల్., ఎం. జి. బి. ఎస్., ఈ. సి. ఐ. ఎల్., జీడిమెట్ల , రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టు నుండి ప్రత్యేక బస్సులు ఉంటాయి.

ఓట్ల పండుగ కోసం పోటెత్తిన ఓటర్లతో రద్దీగా మారింది విజయవాడ బస్ స్టేషన్. విజయవాడ నుండి విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు, కాకినాడ, ఏలూరు, ఒంగోలు, గుంటూరు తదితర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. బెంగుళూరు నుండి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు 11 వ తేదీన మొత్తం 323 బస్సులు, 12 వ తేదీన 269 బస్సులు ఏర్పాటు చేశారు. ప్రత్యేక బస్సులు కూడా సాధారణ ఛార్జీలతోనే నడపబడతాయి. ఓటు వేసి తిరిగి ప్రయాణమయ్యే వారి కోసం కూడా ఇబ్బందులు లేకుండా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news