రేపు రాష్ట్రంలోని 17 పార్లమెంట్‌ స్థానాలకు పోలింగ్

-

తెలంగాణలో రేపు (మే 13వ తేదీ 2024)న పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాలు, కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానానికి రేపు పోలింగ్‌ నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 35,809 కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియ జరగనుంది. 106 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో సాయంత్రం 6 వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. 13 సమస్యాత్మక సెగ్మెంట్లలో సాయంత్రం 4 వరకు ఓటింగ్ ప్రక్రియ జరుగుతుందని చెప్పారు. జూన్ 4వ తేదీన లెక్కింపు ప్రక్రియ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

17 లోక్‌సభ స్థానాల బరిలో 51 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 3.17 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. వారిలో పురుషులు 1,58,71,493 మంది, 1,58,43,339 మంది మహిళా ఓటర్లు, 2,557 మంది ట్రాన్స్‌జెండర్‌ ఓటర్లు ఉన్నారు. అత్యధికంగా సికింద్రాబాద్ పార్లమెంటు స్థానానికి 45 మంది పోటీ చేస్తుండగా.. అత్యల్పంగా ఆదిలాబాద్ లోక్‌సభ స్థానానికి 12 మంది ఎన్నికల బరిలో నిలిచారు.

Read more RELATED
Recommended to you

Latest news