BREAKING: పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత కార్యాలయం ముట్టడి !

-

కాకినాడ జిల్లా పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకు ఊహించని షాక్‌ తగిలింది. పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత పార్టీ కార్యాలయాన్ని చుట్టుముట్టారు ఓటర్లు. వార్డుల్లో కొంత మందికి డబ్బులు ఇచ్చి మాకు ఇవ్వలేదు అని నిరసనకు దిగారు ఓటర్లు. ఇక ఈ విషయం తెలుసుకుని కార్యాలయానికి వచ్చిన ఓటర్లు ను చెదరగొట్టారు పోలీసులు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

 

Voters surrounded the party office of YCP candidate Vanga Geetha in Pithapuram

అటు పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలం కొండెవరంలో ఓటుకు డబ్బులు ఇవ్వలేదని రోడ్డు పై ధర్నా చేపట్టారు గ్రామస్తులు. నిన్నటి నుండి వైసీపీ నేతలు డబ్బులు ఇస్తామని చెప్పి ఇవ్వలేదంటూ ఆందోళనకు దిగారు సొంటివారి పాకల, ఇందిరా కాలనీ గ్రామస్తులు. స్థానిక వైసీపీ నాయకుడు దాదాపు 100 కుటుంబాలకు చెందిన డబ్బులు నొక్కేశాడని ఆరోపణలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news