BREAKING: ఏపీలో 78.36 శాతం మేర పోలింగ్ జరిగింది. ఈసీ లెక్కల ప్రకారం 78.36 శాతం మేర పోలింగ్ జరిగిందట. ఇవాళ మధ్యాహ్నం లేదా సాయంత్రానికి పూర్తి స్థాయి పోలింగ్ శాతం వస్తుందన్నాయి ఈసీ వర్గాలు. గత ఎన్నికల పోలింగ్ శాతం కంటే ఈసారి పోలింగ్ శాతం పెరుగుతుందని తెలిపారు సీఈఓ. 82 లేదా 83 శాతం వరకు పోలింగ్ ఫైనల్ ఫిగర్స్ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
చాలా చోట్ల అర్ధరాత్రి వరకూ పోలింగ్ కొనసాగింది. మచిలీపట్నం, గన్నవరం నియోజకవర్గాలు, సత్య సాయి జిల్లాల్లో రాత్రి 12 గంటల తర్వాత కూడా కొనసాగింది పోలింగ్. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున క్యూ లైన్లో వేచి ఉన్నారు ఓటర్లు. ఇవాళ 17A స్క్రూట్నీ తర్వాత రీ-పోలింగ్ పై క్లారిటీ రానుంది. 11 చోట్ల ఈవీఎంల ధ్వంసం అయ్యాయి. వీటి వివరాలు ఇవాళ సాయంత్రం వస్తాయి.