చార్‌ధామ్‌ యాత్ర.. ఈ నెల 31 వరకు వీఐపీ దర్శనాలు బంద్‌

-

పవిత్ర చార్‌ధామ్‌ యాత్రకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలు హరహర మహాదేవ, జై మా యమున నినాదాలతో మార్మోగుతున్నాయి. భక్తుల రద్దీ నేపథ్యంలో ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి చేసిన ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31వ తేదీ వరకు వీఐపీలు ఆలయాలకు రావొద్దని సూచించింది.

చార్‌ధామ్‌కు వీఐపీ దర్శనాలను నిలిపివేస్తూ ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాధా రాతురి ఆదేశాలు జారీ చేశారు.  ఆలయాలకు 50 మీటర్ల పరిధిలో ఎలాంటి వీడియోలు తీయడం గానీ, రీల్స్‌ చేయడం వంటి వాటిపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. చార్‌ధాయ్‌ యాత్ర ఈ నెల 10న ప్రారంభమైన విషయం తెలిసిందే. చార్‌ధామ్‌ యాత్రకు వెళ్లాలనుకునే భక్తులు తప్పనిసరిగా ముందుగా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం గురువారం స్పష్టం చేసింది.

ఈ యాత్రకు భక్తులు పోటెత్తుతుండటంతో రవాణా సదుపాయాలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇప్పటికే 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో గంగోత్రి, యమునోత్రిలకు రావాలనుకునే భక్తులు ముందుగానే రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news