బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామ్ రెడ్డి వెంటనే అరెస్ట్‌ చేయాలి – రఘునందన్‌ రావు

-

బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామ్ రెడ్డి వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌ రావు. …..BRS ఎమ్మెల్సీ వెంకట్ రామిరెడ్డి ని అరెస్ట్ చేయాలనీ డీజీపీ కి ఫిర్యాదు చేసాం..ఫోన్ ట్యాపింగ్ కేసు లో వెంకట్ రామిరెడ్డి పాత్ర ఉందని మాజీ డీసీపీ రాధాకిషన్ రావు స్టేట్ మెంట్ ఇచ్చాడన్నారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. అసెంబ్లీ ఎన్నికల సమయం లో వెంకట్ రామిరెడ్డికి సంబందించిన మూడు కోట్లు తరలించినట్లు రాధాకిషన్ స్టేట్ మెంట్ ఇచ్చారు..వెంకట్ రామిరెడ్డి పై ఇప్పటి వరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వెల్లడించారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు.

raghunandan rao vs venkaramireddy

ఎందుకు వెంకట్ రామిరెడ్డి ని కాపాడుతున్నారు..ఎవ్వరు కాపాడుతున్నారు..సమాధానం చెప్పాలని డీజీపీ ని కోరానన్నారు. పొంగులేటి వియంకుడు వెంకట్ రామిరెడ్డి ని అరెస్ట్ చెయ్యడం లేదా…ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. BRS ఎమ్మెల్సీ కి వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉన్నా కూడా అరెస్ట్ చెయ్యడం లేదు…వెంకట్ రామిరెడ్డి ని కులం ఒకటే అని ముఖ్యమంత్రి కాపాడుతున్నాడు..వెంటనే వెంకట్ రామిరెడ్డి ని అరెస్ట్ చేయాలని డిమాండ్‌ చేశారు.
మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా వెంకట్ రామిరెడ్డి ని అరెస్ట్ చేయాలి..డీజీపీ గారు సానుకూలంగా స్పందించారన్నారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు.

Read more RELATED
Recommended to you

Latest news